Karimnagar: ఎలక్ట్రిక్ బస్సులు బంద్.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు!

Karimnagar: ఆర్టీసీ టు డిపోలో ఎలక్ట్రిక్ బస్సులను అధికారులు నిలిపివేశారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో 104 బస్సులకు ఫిట్నెస్ తనిఖీలు చేపట్టారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 1 July 2026 10:44 AM IST
Karimnagar
X

Karimnagar: ఎలక్ట్రిక్ బస్సులు బంద్.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు!

కరీంనగర్: ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదంతో కరీంనగర్ ఆర్టీసీ టు డిపోలో నిలిచిన ఎలక్ట్రికల్ బస్సులు.

ఎలక్ట్రిక్ బస్సుల వరుస ప్రమాదాలతో ఈరోజు ఉదయం జరిగిన ప్రమాదంతో కరీంనగర్ టు డిపో కు సంబంధించిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను నిలిపివేశారు.

దీనితో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ కు సంబంధించిన 104 ఎలక్ట్రిక్ బస్సులను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈరోజు ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో బస్సు నిలిపి ఉండడంతో ప్రమాదం తప్పింది.

ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టి ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన యజమానులకు బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ ఉందా లేదా తనిఖీలు చేసి వాటి మెయింటెనెన్స్ సరిగా ఉందా అన్న విచారణ చేయడం కోసం బస్సులను నిలిపివేశారు.

ప్రమాదాల నివారణ కోసం ఆర్టీసీ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.ఉదయం నిలిపివేసిన వాహన యజమానులు ఇప్పటివరకు రాకపోవడం గమనార్హం.

ఆర్టీసీ అధికారులు ఎలక్ట్రిక్ బస్సులను పూర్తిగా తనిఖీలు చేసి ఫిట్నెస్ ఉంటేనే వాటిని నడపడానికి అనుమతులు ఇస్తామని తెలిపారు.

104 వాహనాలు ఒకేసారి నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్య ఆర్టీసీ కారులో వేరే వాహనాలను తక్కువ ట్రిప్పుల తిప్పుతున్నారు.

ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story