Karimnagar: కరీంనగర్‌లో మొరాయించిన ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణికుల అవస్థలు

Karimnagar: నిజామాబాద్ వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు కోర్టు సర్కిల్ వద్ద మొరాయించడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు, రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 15 Sept 2026 1:19 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో మొరాయించిన ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణికుల అవస్థలు

Karimnagar: మళ్లీ మొరాయిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఉదయం 9 గంటలకు కరీంనగర్ నుండి నిజాంబాద్ బయలుదేరిన నిజామాబాద్ టు డిపో కు సంబంధించిన బస్సు కోర్టు సర్కిల్ వద్ద ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కరీంనగర్ బస్టాండ్ నుండి 40 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు కోర్టు వద్దగల అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా నిలిచిపోయింది. దీనితో డ్రైవర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా స్టార్ట్ కాకపోవడంతో రోడ్డుపైనే వదిలేసి ప్రయాణికులను వేరొక బస్సులో ఎక్కించి పంపించారు.

ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతూ ఎలక్ట్రిక్ బస్సులు నమ్ముకుంటే నట్టేట ముంచేట్లు ఉందని వాపోయారు. ఉదయం వేళ కోర్టు సర్కిల్ వద్ద వాహనాలు నిజామాబాద్, జగిత్యాల్, కోరుట్ల, లక్షట్ పేట్, మంచిర్యాల్, గోదావరిఖని రోడ్లలో నడిచే బస్సులన్నీ ఈ సర్కిల్ నుండే టర్న్ అవుతాయి దీనితో సర్కిల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

ట్రాఫిక్ పోలీసులు సకాలంలో స్పందించి సర్కిల్ వద్దకు చేరుకొని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. బస్సును తొలగించడానికి ఆర్టీసీ అధికారులు చాలా ఆలస్యంగా రావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఓ పక్క ప్రయాణికులు మరోపక్క వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN