Jagtial: కోడలి వేధింపులపై ప్రజావాణిలో అత్త ఫిర్యాదు: జగిత్యాలలో ఘటన!

Jagtial: ఆస్తి, ఇన్సూరెన్స్ వాటా వదులుకోవాలని కోడలు వేధింపులకు గురిచేస్తోందంటూ జగిత్యాల ప్రజావాణిలో ధర్మపురికి చెందిన వృద్ధురాలు కలెక్టర్ సత్యప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు.

ANAND, JAGITYAL
Published on: 24 Aug 2026 10:08 PM IST
Jagtial
X

Jagtial: కోడలి వేధింపులపై ప్రజావాణిలో అత్త ఫిర్యాదు: జగిత్యాలలో ఘటన!

జగిత్యాల: ఆస్తి, ఇన్సూరెన్స్ హక్కులను వదులుకోవాలని కోడలు కామొజ్జల మానస తనపై బెదిరింపులకు పాల్పడుతోందని ధర్మపురికి చెందిన వృద్ధురాలు దహగం దత్తప్రియ ఆరోపించారు. సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌ను ప్రజావాణిలో కలసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.

తన చిన్న కుమారుడు గిరీష్ గత మే 18న గుండెపోటుతో మరణించాడని, నాటి నుంచి ఇన్సూరెన్స్‌లోని తన వాటాను వదులుకోవాలని, ఎన్‌ఓసీపై సంతకం చేయాలని కోడలు ఒత్తిడి తెస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంతకం చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తూ, ఇటీవల ఇంటికి వచ్చి భౌతిక దాడికి యత్నించిందని పేర్కొన్నారు.

తాను లేని సమయంలో కిరాణా సరుకుల్లో గుర్తుతెలియని పదార్థాలు కనిపించాయని, తమ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు. ఫోర్జరీ సంతకాలపై విచారణ జరిపి, న్యాయస్థానంలో ఉన్న ఆస్తి వివాదంపై నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టాలని కోరారు. సీనియర్ సిటిజన్ల చట్టం కింద ఆర్‌డీఓకు కూడా ఫిర్యాదు చేశానని, తమ దంపతులకు తక్షణ రక్షణ కల్పించాలని అధికారులను అభ్యర్థించారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL

Next Story