Karimnagar: విద్యారంగ పరిరక్షణకై జూన్ 5న హైదరాబాద్‌లో మహాధర్నా
Karimnagar: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జూన్ 5న హైదరాబాద్‌లో విద్యా పరిరక్షణ కమిటీ తలపెట్టిన ధర్నా కరపత్రాన్ని కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆవిష్కరించారు.
Karimnagar: విద్యారంగ పరిరక్షణకై జూన్ 5న హైదరాబాద్‌లో మహాధర్నా
Karimnagar: విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 5న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ధర్నా, ర్యాలీకి సంబంధించిన కరపత్రం, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలోఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డీటీఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి మాట్లాడుతూ, బడ్జెట్‌లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని, వేలాది గ్రామీణ పాఠశాలల మూసివేతకు దారితీసే తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల స్థాపనను విరమించుకోవాలని, జీవో నెం.25ను ఉపసంహరించుకుని ప్రతి తరగతికి ఒకఉపాధ్యాయుడిని కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్ల సాధన కోసం విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 5న హైదరాబాద్‌లో తలపెట్టిన ధర్నా, ర్యాలీలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే, ఈహెచ్‌ఎస్ (EHS) అమలుకు సంబంధించి ఎలాంటి విధివిధానాలు. రూపొందించకుండానేఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకోకుండానే మే నెల వేతనాల నుంచి ఈహెచ్‌ఎస్ ప్రీమియం మినహాయించడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. జమ్మికుంట ఎంఈఓ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ జమ్మికుంట మండల అధ్యక్షుడు వేణుమాధవ్, ప్రధాన కార్యదర్శి సంపత్, టీపీటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, టీపీటీఎఫ్ జిల్లా నాయకులు కె. తిరుపతి, జెడ్పీహెచ్‌ఎస్ జమ్మికుంట ప్రధానోపాధ్యాయులు సురేష్, డీటీఎఫ్ నాయకులు ఎం. సదానందం, ఎం. శ్రీనివాస్, హరీష్ కుమార్, ప్రేమలత, పద్మ, శైలజ, రాణి తదితరులు పాల్గొన్నారు.




