Karimnagar: డ్రైనేజీ సమస్యపై షాషా మహల్ వాసుల తీవ్ర ఆగ్రహం!
Karimnagar: కరీంనగర్ లక్ష్మీనగర్ షాషా మహల్ కాలనీలో ఇళ్ల ముందుకు నిలిచిన డ్రైనేజీ నీటిపై సామాజిక కార్యకర్త కోట శ్యామ్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు.
Karimnagar: డ్రైనేజీ సమస్యపై షాషా మహల్ వాసుల తీవ్ర ఆగ్రహం!
కరీంనగర్: మేము ఇంట్లో నుంచి ఎలా బయటకు రావాలి ? మేము టాక్స్ లు కట్టడం లేదా ? మా పైసలు మాకు ఇవ్వండని షాషామహల్ ప్రజలు నగరపాలక సంస్థ అధికారులను ప్రశ్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త కోటా శ్యాం కుమార్ బాధితుల ఇళ్ళ మధ్యకు వెళ్లి ఫ్లా కార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కోట శ్యామ్ కుమార్ మాట్లాడుతూ స్థానిక లక్ష్మీ నగర్ షాషామహల్ కాలనీలో డ్రైనేజీ వాటర్ ఇంటి ముందు నిండి పోవడంతో ప్రజలు బయటకు వెల్లకుండా ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. డ్రైనేజీ పేరుకుపోవడంతో గోరమైన దుర్వాసనతో చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు టాక్స్ లు కట్టినపుడు ప్రజలకు సమస్యలు లేకుండా చూసుకోవాలని సూచించారు. నగర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం నగర నడిబొడ్డున సమస్యలు కనిపించడం లేదా అని ఎద్దేవా చేశారు. సౌకర్యాలు కల్పిస్తామని టాక్సులు వసూలు చేసిన వారి టాక్స్ను వారికి రిటర్న్ ఇచ్చేయాలని అదికారులను కోరారు.
కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజల ప్రధమ అవసరాలైన మంచినీరు రోడ్లు డ్రైనేజీ కల్పిస్తామని కల్పించలేకపోతున్నారని, మాయ మాటలు చెప్పి అధికారం చేపట్టడం కాదు ప్రజలకు సౌకర్యాలు కల్పించి ఓట్లు అడగాలని అన్నారు.




