Jammikunta: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరేందుకు దోస్త్ స్పెషల్ డ్రైవ్!
Jammikunta: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. రమేష్ తెలిపారు.
Jammikunta: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరేందుకు దోస్త్ స్పెషల్ డ్రైవ్!
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని కళాశాలు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. రమేష్ తెలిపారు. జమ్నికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరే విద్యార్థులు డిగ్రీ దోస్త్ (DOST) స్పెషల్ డ్రైవ్ ఫేజ్ - 2 ద్వారా ఈ నెల -11వరకు అడ్మీషన్లకు దరఖాస్తు చేసుకోగలరన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరెందుకు వచ్చిన మరో మంచి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కళాశాలలో దాతల సహకారంతో ఉచిత మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్నామన్నారు.
ప్యూరీపైడ్ వాటర్ ప్లాంట్ , డిజిటల్ లైబ్రరీ, ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ లు, డిజిటల్ తరగతులు వంటి మెరుగైనా వసతులను ఉన్నాయన్నారు. గత విద్యాసంవత్సరంలో కళాశాలలో 42 మంది విద్యార్థులు వివిధ కంపేనినీలలో ఉద్యోగాలు సాధించారని, మరో 40 మంది విద్యార్థులు వివిధ ఉద్యోగాల శిక్షణకు ఎంపికైయ్యారని పెర్కొన్నారు.
అలాగే మరో పది మంది విద్యార్థులు కేంద్రీయ విశ్వ విద్యాలయాలలో పీజీ సీట్లు సాధించడం చాల సంతోషకరమైన విషయమన్నారు.ఈ కళాశాలలో నూతన కోర్సు B.Com (రిటైల్ ఆపరేషన్) తో పాటు B.A, B.Com, B.SC. లలో కంప్యూటర్ కోర్సులు, ఆఫీస్ మేనేజ్మెంట్, డైరీ సైన్స్, క్రాప్ ప్రొడక్షన్ వంటి ఉపాధి కల్పించే మంచి కోర్సులు ఉన్నాయన్నారు.
విద్యార్థులు తమ బంగారు భవిష్యత్ కై జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరే ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.




