Peddapalli: పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో YAG లేజర్ చికిత్సలు విజయవంతం!

Peddapalli: ఆసుపత్రిలో క్యాటరాక్ట్ శస్త్రచికిత్స తర్వాత మసకదృష్టితో బాధపడుతున్న ఐదుగురు రోగులకు విజయవంతంగా YAG క్యాప్సులోటమీ లేజర్ చికిత్సను అందించారు.

RAJU, PEDDAPALLI
Published on: 2 Sept 2026 7:38 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో YAG లేజర్ చికిత్సలు విజయవంతం!

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాకు చెందిన ఐదుగురు పేషంట్లు గతంలో కాటరాక్ట్ (శుక్లం) శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం కంటి లెన్స్ వెనుక భాగంలో ఏర్పడిన మసకదృష్టి సమస్యతో వారు జిల్లా ఆసుపత్రి పెద్దపల్లిని సంప్రదించారు. వారిని పరీక్షించిన వైద్యులు, నేడు YAG క్యాప్సులోటమీ (YAG Capsulotomy) అనే ఆధునిక లేజర్ చికిత్సను వారికి విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ చికిత్స ద్వారా పేషంట్లకు మసకదృష్టి సమస్యను తొలగించి చూపును మెరుగు పరచడం జరిగింది.

ఈ ప్రక్రియలో పాల్గొన్న వైద్య బృందం ఆప్తమెట్రిస్ట్ శైలజ, అరుణ్ గార్లను జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్ గారు అభినందించారు. జిల్లా ఆసుపత్రి పెద్దపల్లిలో లాపరోస్కోపీ, యూరాలజీ, వివిధ లేజర్ చికిత్సలు, ఫిస్టులా వంటి అనేక క్లిష్టమైన మరియు ఆధునిక శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయని సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్ గారు తెలిపారు. ఈ అధునాతన వైద్య సేవలను పెద్దపల్లి జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ గారు ఒక ప్రకటనలో కోరారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI

Next Story