Bhupalpally: జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించిన కలెక్టర్ రాహుల్ శర్మ!

Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ సందర్శించారు.

RAJU, BHUPALAPALLI
Published on: 20 Aug 2026 4:14 PM IST
Bhupalpally
X

Bhupalpally: జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించిన కలెక్టర్ రాహుల్ శర్మ!

భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి పట్టణంలోని జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో చదువులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడి వారి అవసరాలు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం గ్రంథాలయంలోని మౌలిక సదుపాయాలను పరిశీలించిన కలెక్టర్.. విద్యార్థులకు అవసరమైన పుస్తకాల లభ్యత, డిజిటల్ వనరుల వినియోగం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. గ్రంథాలయ భవనం పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచేందుకు భవనం ముందు మొక్కలు నాటే అంశాన్ని కూడా సమీక్షించారు.

విద్యార్థులు గ్రంథాలయ సేవలను సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్, గ్రంథాలయ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, డీపీఆర్వో తదితరులు పాల్గొన్నారు.

RAJU, BHUPALAPALLI

RAJU, BHUPALAPALLI

Next Story