Jagtial: కలెక్టరేట్ ఎదుట ఆటో కార్మికుల ధర్నా

Jagtial: కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ ప్రకారం ఆటో కార్మికులకు రూ. 12,000 సాయం అందించాలని జగిత్యాలలో ఆటోల బంద్, కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

ANAND, JAGITYAL
Published on: 24 Aug 2026 7:41 PM IST
Jagtial
X

Jagtial: కలెక్టరేట్ ఎదుట ఆటో కార్మికుల ధర్నా

జగిత్యాల: కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఆటో కార్మికుడికి రూ. 12,000 ఆర్థిక సహాయం వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆటో కార్మికులు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆటోల రాకపోకలు నిలిచిపోయాయి.

అనంతరం జగిత్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన కార్మికులు, తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ‘ప్రజావాణి’ కార్యక్రమంలో అధికారులకు అందజేశారు.

ఈ సందర్భంగా డిజిల్ ఆటో సంక్షేమ సంఘం (జగిత్యాల) నాయకులు మాట్లాడుతూ... రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, ఇంధన ధరల వల్ల ఆటో నడుపుకొని జీవించడం తీవ్ర భారంగా మారిందని వాపోయారు. గత 40 ఏళ్లుగా ఆటో డ్రైవింగే నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని, నిరంతరం వాహనాలు నడపడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆటో కార్మికుల ప్రధాన డిమాండ్లు:

* కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన రూ. 12,000 ఆర్థిక సాయాన్ని వెంటనే విడుదల చేయాలి.

* ఆటో కార్మికులకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి.

* అనారోగ్య బారిన పడుతున్న డ్రైవర్లకు ప్రభుత్వపరంగా భద్రత, ఆర్థిక చేయూత అందించాలి.

ఈ కార్యక్రమంలో డిజిల్ ఆటో సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు బొల్లి శేఖర్, అధ్యక్షులు దేవర శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎండి పాషాతో పాటు పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL

Next Story