Karimnagar: లింగంపల్లి గ్రామానికి మహర్దశ.. ఎంపీ నిధులతో మౌలిక వసతుల కల్పన!
Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లింగంపల్లిలో ఎంపీ బండి సంజయ్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను బీజేపీ నేత పేరుక శ్రవణ్ కుమార్ ప్రారంభించారు.
Karimnagar: లింగంపల్లి గ్రామానికి మహర్దశ.. ఎంపీ నిధులతో మౌలిక వసతుల కల్పన!
కరీంనగర్ జిల్లా: గంగాధర మండలంలోని లింగంపల్లి గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కృషితో ఎంపీ నిధుల ద్వారా చేపట్టబడిన అభివృద్ధి పనులలో భాగంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి చొప్పదండి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పేరుక శ్రవణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించారు. గ్రామాభివృద్ధి దిశగా రహదారులు, కాల్వలు, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఎంపీ నిధులను వినియోగించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పేరుక శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి ద్వారా దేశం అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.




