Karimnagar: తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక సర్వాయి పాపన్న గౌడ్!
Karimnagar: కరీంనగర్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు అధికారికంగా జరిగాయి. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు పాల్గొని నివాళులర్పించారు.
Karimnagar: తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక సర్వాయి పాపన్న గౌడ్!
కరీంనగర్: చరిత్ర పుటల్లో నిలిచిపోయిన బహుజన వీరుడు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ లో గురువారం రోజు సర్థార్ సర్వాయి పాపన్న వర్థంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని కలెక్టరెట్ లో అధికారికంగా నిర్వహించిన సర్వాయి పాపన్న గౌడ్ వర్థంతి వేడుకలకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాపన్న, చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం కోసం సర్వాయి పాపన్న చేసిన సేవలను స్మరించుకున్నారు.
మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ..
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన ధైర్యసాహసాలు నేటి తరానికి ఆదర్శమని మేయర్ కొనియాడారు. తెలంగాణ గడ్డపై అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తి, బహుజన రాజ్యాధికారం కోసం పోరాడిన అసమాన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. చరిత్ర పుటల్లో నిలిచిపోయిన బహుజన వీరుడు, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
17వ శతాబ్దంలో సామాన్య గీత కార్మికుడి ఇంట జన్మించిన సర్వాయి పాపన్న.. అసామాన్య స్థాయికి ఎదిగారు. అప్పటి మొఘల్ సామ్రాజ్య పాలకుల దమననీతిని, జమీందారుల అకృత్యాలను ఎదిరించి నిలిచిన ధీశాలి. పీడిత, అణగారిన వర్గాలను ఏకం చేసి 3 వేల మందికి యుద్ద విద్యలు నేర్పించి, తనకంటూ ఒక సొంత సైన్యాన్ని నిర్మించుకున్నారు. వరంగల్ జిల్లాలోని కిలా షాపూర్ ను రాజధానిగా చేసుకుని సుమారు 30 ఏళ్ల పాటు బహుజన రాజ్యాన్ని పాలించారు. కేవలం గెరిల్లా పోరాటాలకే పరిమితం కాకుండా, మొఘల్ సైన్యాన్ని మట్టికరిపించి చారిత్రక గోల్కొండ కోటపై విజయకేతనం ఎగురవేసిన ఏకైక బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న.
తెలంగాణ మొఘల్ రాజు అప్పటి పాలకుల, అంతకంతకు పెరుగుతున్న ముస్లింల ఆధిపత్యాన్ని అంతం చేయాలని, తాబేదారులు, జమిందారులు, జాగీర్ధారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను అణచివేసేందుకు ప్రస్తానం ప్రారంభించారు. అతని సామ్రాజ్యం తాడి కొండ, కొలనుపాక, చేర్యాల నుండి కరీంనగర్ జిల్లా లోని హుస్నాబాద్, హుజూరాబాద్ వరకు విస్తరించింది. 1708 ఏప్రిల్ 1 న వరంగల్ కోట పై ధాడి జరిగింది. ఆ దాడిలో పాపన్న పట్టుబడ్డాడు. శత్రువుల చేతిలో చావడం ఇష్టం లేని పాపన్న తన బాకుతోనే గుండెల్లో పొడుచుకొని చనిపోయారు.
డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ..
"సమాజంలో అణగారిన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని కలలుగని, ఆ కలను సాకారం చేసుకున్న గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యాన్ని సైతం గడగడలాడించిన ఆయన ధీరత్వం మనందరికీ గర్వకారణం. పాపన్న చూపిన పోరాట స్ఫూర్తితోనే, మనమంతా ఐక్యంగా ముందుకు సాగాలి. బహుజనుల అభ్యున్నతికి, సమాజ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం." తెలంగాణ రాష్ట్రం లో మొగలాయి విస్తరణను మొదటి సారి అడ్డుకున్నది సర్వాయి పాపన్న గౌడ్. పాపయ్య గౌడ పోరాట స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీస్కోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి పొన్నం శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షులు దులం అంజయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి జాగిరి సాగర్, గౌడ నేతలు ఈశ్వర్ గౌడ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.




