Karimnagar: కూరగాయల సంతలో చలివేంద్రం.. ప్రారంభించిన చైర్‌పర్సన్ వడ్లూరి సరిత
Karimnagar: కరీంనగర్ జిల్లా చొప్పదండి వారసంతలో దారుల్ ఖైర్ సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు.
Karimnagar: కూరగాయల సంతలో చలివేంద్రం.. ప్రారంభించిన చైర్‌పర్సన్ వడ్లూరి సరిత
Karimnagar: కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని కూరగాయల వారసంతలో సామాజిక సేవకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే కార్యక్రమం నేడు జరిగింది. దారుల్ ఖైర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివెంద్రాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్, పెరుమాండ్ల మానస గంగయ్య చేతుల మీదుగా ప్రారంభించారు.
వారసంతకు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చలివెంద్రాన్ని ఏర్పాటు చేశారు. గత ఎనిమిదేళ్లుగా నిరంతరం ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ, చల్లని మినరల్ వాటర్ అందించి ప్రజల దాహాన్ని తీర్చడం ద్వారా దారుల్ ఖైర్ సొసైటీ సభ్యులు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్ మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా సమాజానికి సేవ చేస్తున్న దారుల్ ఖైర్ సొసైటీ సభ్యులను అభినందించారు. వారసంతకు వచ్చే ప్రజలకు, అలాగే కూరగాయలు అమ్ముకునే వ్యాపారులకు తాగునీటి సదుపాయం కల్పించడం గొప్ప సేవ అని అన్నారు. గత ఎనిమిదేళ్లుగా నిరంతరంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఐక్యత, సోదరభావాన్ని చాటుతున్న ముస్లిం సంఘం సభ్యులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సీలర్లు కోట్టే సునిత అశోక్, చిల్ల అర్చాన శ్రవణ్, గుర్రం సుజిత్ రెడ్డి, కోత్త సుమలత గంగరెడ్డి, పిట్టల వెంకటేష్, ముద్దం రాజేశ్వరి తిరుపతి, జిట్టా మంగ కుమార్, సింహాచలం ప్రభాకరాచార్యులు, ముస్లిం మైనారిటీ మండల, పట్టణ అధ్యక్షుడు జహిరొద్దిన్, జామే మస్జీద్ అధ్యక్షుడు అబిద్ అలీ, మాజీ కో-ఆప్షన్ ఖాజా, డాక్టర్ ఖుద్దుస్, అహ్మద్ బిన్ సులేమాన్, అంజాద్ ఖాన్, నాజిబ్ అహ్మద్, ఇంజనీర్ షకీల్, జామలుద్దీన్, మతినుద్దీన్, అసిఫ్ అలీ, గౌసొద్దీన్, అహ్మద్, సాజిద్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.




