Sircilla: ఎల్లారెడ్డిపేట మండలం పదిర వంతెనపై ప్రమాద ఘంటికలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర–హరిదాస్ నగర్ మధ్య ఉన్న ఇరుకు వంతెన ప్రమాదాలకు నిలయంగా మారింది.

KALEEM, SIRICILLA
Published on: 6 July 2026 3:12 PM IST
Sircilla
X

Sircilla: ఎల్లారెడ్డిపేట మండలం పదిర వంతెనపై ప్రమాద ఘంటికలు!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర–హరిదాస్ నగర్ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ఉన్న వంతెన ప్రస్తుతం ప్రమాదాలకు నిలయంగా మారింది. వంతెన అత్యంత ఇరుకుగా ఉండటంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు దాటుకోవడం కష్టసాధ్యంగా మారింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో, వర్షాకాలంలో వాహనదారులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇప్పటికే ఇదే వంతెనపై ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి వంతెనపై నుంచి బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఆ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. అయితే ఇలాంటి ప్రమాదాలు పునరావృతమైతే తీవ్ర విషాదం తప్పదనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది.

వంతెనకు ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడం, హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, వీధి దీపాల ఏర్పాటు లేకపోవడంతో రాత్రి సమయంలో ప్రమాద ముప్పు మరింత పెరుగుతోంది. ఈ మార్గంలో ప్రతిరోజూ రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు శాశ్వత భద్రతా చర్యలు చేపట్టకపోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదం జరిగిన తర్వాత హడావుడిగా చర్యలు తీసుకోవడం కంటే, ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. సంబంధిత శాఖ అధికారులు వెంటనే ఈ వంతెనను పరిశీలించి, అవసరమైన మరమ్మతులు, రక్షణ గోడలు, హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, వీధి దీపాల ఏర్పాటుతో పాటు వంతెనను విస్తరించే దిశగా చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

"ప్రాణనష్టం జరిగిన తర్వాత స్పందించడం కాదు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఇప్పుడే చర్యలు తీసుకోండి" అంటూ గ్రామస్థులు జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story