Cyber Safety: కరీంనగర్‌లో బాలల సంరక్షణ కేంద్రాల్లో సైబర్ క్రైమ్స్‌పై అవగాహన.. చైర్‌పర్సన్ ధనలక్ష్మి పిలుపు!

Cyber Safety: కరీంనగర్ జిల్లాలో చైల్డ్ వీక్ సందర్భంగా బాలల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సోషల్ మీడియా మరియు ఆన్‌లైన్ మోసాల నుండి పిల్లలు ఎలా రక్షణ పొందాలో అధికారులు వివరించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 30 April 2026 8:03 AM IST
Cyber Safety
X

Cyber Safety: కరీంనగర్‌లో బాలల సంరక్షణ కేంద్రాల్లో సైబర్ క్రైమ్స్‌పై అవగాహన.. చైర్‌పర్సన్ ధనలక్ష్మి పిలుపు!

కరీంనగర్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక చైల్డ్ వీక్ లో భాగంగా, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ లో ఉన్న అన్ని పిల్లల సంరక్షణ కేంద్రాలలో సైబర్ క్రైమ్స్ పై అవగాహన నిర్వహించారు, ఈ సందర్బంగా సంక్షేమ ట్రస్ట్ పిల్లల సంరక్షణ కేంద్రాంలో బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ ధనలక్ష్మి పాల్గొని సైబర్ క్రైమ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఫోన్ లకు దూరంగా ఉండాలని అని అన్నారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్ మాట్లాడుతూ, పిల్లలు మరియు యువతపై పెరుగుతున్న సైబర్ క్రైమ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సోషల్ మీడియా ద్వారా అపరిచితులతో చాట్ చేయడం, వ్యక్తిగత వివరాలు పంచుకోవడం, ఆన్‌లైన్ గేమ్స్ ద్వారా మోసాలకు గురికావడం వంటి ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి సభ్యులు రేండ్ల కళింగ శేఖర్, విజయ్, పిఓ శాంత, రాజ్ కుమార్, హోమ్ ఇంచార్జి వకుల దేవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story