Karimnagar: కేసీఆర్, రేవంత్ రెడ్డిల రాజీనామాలపై సీపీఎం విమర్శలు!

Karimnagar: కేసీఆర్, రేవంత్ రెడ్డి రాజీనామాలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని సీపీఎం కరీంనగర్ నగర కార్యదర్శి గుడికందుల సత్యం విమర్శించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 6 Sept 2026 1:55 PM IST
Karimnagar
X

Karimnagar: కేసీఆర్, రేవంత్ రెడ్డిల రాజీనామాలపై సీపీఎం విమర్శలు!

Karimnagar: రాష్ట్రంలో ప్రజా సమస్యలు పక్కదారి పట్టించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కెసిఆర్ రాజీనామా చేయాలని ధర్నాలు చేయడం, మరో పక్క ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా బి ఆర్ ఎస్ నేత కెసిఆర్ అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజా సమస్యలపై మాట్లాడకుండా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి అని ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం అన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, అమలు చేయకుంటే ప్రజా సమస్యలపై గలమెత్తి పోరాడవలసిన ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కాలయాపన చేస్తున్నారని, కెసిఆర్, రేవంత్ రెడ్డి ఎవరు రాజీనామా చేసిన ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు.

స్మార్ట్ సిటీ గా ఎంపికైన కరీంనగర్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని *కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపనలు చేసి పాలాభిషేకాలు చేసుకున్నారని,4 సంవత్సరాలు గడుస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు.

రైల్వే గేటు పడటం మూలంగా అంబులెన్స్ సైతం ట్రాఫిక్ లో ఇరుక్కొని పేషెంట్లు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,మళ్ళీ ట్రాఫిక్ క్లియర్ కావడానికి సుమారు అరగంట సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

తలాపున సముద్రం పెట్టుకొని చేప దూపకు ఏడ్చినట్లు పక్కనే లోయర్ మానేర్ డ్యాం పెట్టుకొని కరీంనగర్ ప్రజలు త్రాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.కరీంనగర్ పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం సరిగా లేక చిరుజల్లులకి నగరమంతా జలమయం అవుతుందని అన్నారు. కరీంనగర్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story