Karimnagar: కరీంనగర్ పోలీస్ ఆయుధాగారాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ!
Karimnagar: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్, 9వ ఎన్‌సీసీ బెటాలియన్‌కు చెందిన ఆయుధాగారాలను (బెల్ ఆఫ్ ఆర్మ్స్) సీపీ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేసి, భద్రతా రికార్డులను పరిశీలించారు.
Karimnagar: కరీంనగర్ పోలీస్ ఆయుధాగారాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ!
కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ బెల్ ఆఫ్ ఆర్మ్స్' (ఆయుధాగారం), మరియు కమీషనరేట్ కేంద్రంలోని 9వ తెలంగాణ ఎన్.సి.సి. బెటాలియన్‌కు చెందిన 'బెల్ ఆఫ్ ఆర్మ్స్' (ఆయుధాగారం)ను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆకస్మికంగా సందర్శించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో భాగంగా సీపీ గౌష్ ఆలం ఆయుధ భద్రతా గదిలోని భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. ఆయుధాల నిల్వ & భద్రత....భద్రతా గదిలోని వివిధ రకాల తుపాకులు, మందుగుండు సామగ్రి నిల్వ ఉన్న విధానాన్ని, గది రక్షణ చర్యలను ప్రత్యక్షంగా సమీక్షించారు. ఆయుధాగారంలో ఉన్న మొత్తం తుపాకుల సంఖ్యను, అధికారిక రికార్డుల్లో నమోదైన వివరాలతో సరిపోల్చి తనిఖీ చేశారు.
సిబ్బందికి ఆయుధాలు కేటాయించే మరియు తిరిగి జమ చేసుకునే లాగ్‌బుక్‌లు, స్టాక్ రిజిస్టర్లను నిశితంగా పరిశీలించి రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.
నిర్వహణ సూచనలు...
ఆయుధాల పనితీరు సక్రమంగా ఉండేలా నిరంతరం సర్వీసింగ్ చేయాలని, భద్రతా నిబంధనలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉల్లంఘించవద్దని అడ్మిన్ ఆర్ ఐ శ్రీధర్ రెడ్డి, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆయుధాల భద్రత విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ అడ్మిన్, ఆయుధాగార సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




