Manthani: శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్‌ సెర్చ్: మంథని సీఐ బి. స్వామి!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని మండలం రాజాపూర్ గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

SHANKAR, MANTHANI
Published on: 9 Aug 2026 9:51 PM IST
Manthani
X

Manthani: శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్‌ సెర్చ్: మంథని సీఐ బి. స్వామి!

మంథాని: పెద్దపల్లి జిల్లా మండలం రాజాపూర్ గ్రామంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని సీఐ బి. స్వామి మాట్లాడుతూ... శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు నేరాల నియంత్రణ కోసం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని ప్రజలకు నేరాల నియంత్రణ, అప్రమత్తతపై పోలీసులు అవగాహన కల్పించారు.

గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సీఐ సూచించారు. అపరిచిత వ్యక్తులకు ఎవరూ ఆశ్రయం కల్పించవద్దని కోరారు.

అనంతరం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని, నంబర్‌ ప్లేట్లు లేని 9 వాహనాలను గుర్తించి సీజ్‌ చేశారు. సైబర్‌ నేరాలపై అవగాహన కార్డన్‌ సెర్చ్‌లో భాగంగా సైబర్‌ క్రైమ్‌, గంజాయి నియంత్రణ, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, ట్రాఫిక్‌ నిబంధనలు, కొత్త చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మూఢనమ్మకాల వల్ల కలిగే నష్టాలను వివరించి, వాటికి దూరంగా ఉండాలని సూచించారు.

సైబర్‌ నేరాలకు గురైన వారు ఆలస్యం చేయకుండా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ప్రజలు ఐకమత్యంతో ఉంటూ శాంతియుత వాతావరణాన్ని కాపాడినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రామగిరి ఎస్సై తాడవేని శ్రీనివాస్‌, ముత్తారం ఎస్సై రవి కుమార్‌, సర్పంచ్‌ పుల్లెల భాగ్యలక్ష్మి–కొమురయ్య, ఉప సర్పంచ్‌ కలవేన శ్రీకాంత్‌, పోలీస్‌ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story