Sircilla: జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఎస్. గోపాల్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

KALEEM, SIRICILLA
Published on: 18 Aug 2026 10:14 PM IST
Sircilla
X

Sircilla: జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఎస్. గోపాల్!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు ఎన్నికల నోడల్ అధికారిగా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు ఆర్‌ఐ అడ్మిన్ పర్యవేక్షణలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పరిశీలించి, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు.

ఎన్నికల్లో అధ్యక్షుడిగా వేములవాడ టౌన్ కానిస్టేబుల్ ఎస్. గోపాల్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వి. రవి, వేములవాడ రూరల్ ఎస్‌ఐ వెంకట్రాజం ఎన్నికయ్యారు. సెక్రటరీగా సిరిసిల్ల రూరల్ సీఐ కె. నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీగా గంభీరావుపేట కానిస్టేబుల్ డి. శ్రీనాథ్ రాజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ ఎం. ప్రకాష్, ట్రెజరర్‌గా జిల్లా పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఏ. వేణు ఎన్నికయ్యారు.

ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ముస్తాబాద్ కానిస్టేబుల్ కె. గోపాల్, ఎల్లారెడ్డిపేట కానిస్టేబుల్ ఏ. శ్రీనివాస్, బోయినపల్లి కానిస్టేబుల్ ఏ. సుధాకర్, తంగళ్లపల్లి హెడ్ కానిస్టేబుల్ పద్మ, ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ గడ్డం మహేష్, ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ బి. తిరుపతి ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. పోలీస్ అధికారుల సంఘం సభ్యులు సమన్వయంతో పనిచేస్తూ పోలీస్ శాఖ సంక్షేమం కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story