Sircilla: ఎమ్మెల్యే పదవికి కేటీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్!

Sircilla: సిరిసిల్ల ప్రజలను పట్టించుకోని ఎమ్మెల్యే కేటీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

KALEEM, SIRICILLA
Published on: 9 Aug 2026 2:57 PM IST
Sircilla
X

Sircilla: ఎమ్మెల్యే పదవికి కేటీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్!

Sircilla: సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా సూర దేవరాజు మాట్లాడుతూ.. సిరిసిల్ల ప్రజల సమస్యలను ఎమ్మెల్యే కేటీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనూ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనూ ప్రజా సమస్యలపై కేటీఆర్ దృష్టి సారించలేదని విమర్శించారు.

ప్రజా సమస్యలపై అధికారులతో ఎప్పుడైనా సమీక్ష సమావేశం నిర్వహించారా అని ప్రశ్నించారు. సిరిసిల్ల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా కలిసి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా అని నిలదీశారు.సిరిసిల్ల ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో వారానికి రెండు రోజులు సిరిసిల్లలోనే ఉంటానని, ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే వారానికి రెండు రోజులు కాకపోయినా, ఆరు నెలలకు రెండు రోజులు కూడా సిరిసిల్లలో ఉండటం లేదని విమర్శించారు.

మున్సిపల్ ఎన్నికల సమయంలో సిరిసిల్లలోని 39 వార్డుల్లో పర్యటించి బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు అడిగారని, ప్రజలు బీఆర్ఎస్‌కు మెజార్టీ కౌన్సిలర్ స్థానాలు కట్టబెట్టారని తెలిపారు. అయితే ఎన్నికల తర్వాత ఆయా వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారా అని ప్రశ్నించారు.సిరిసిల్లలో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, స్థానిక మౌలిక వసతులు, నేత కార్మికుల సమస్యలు, ఉపాధి వంటి అంశాలపై ఎమ్మెల్యే స్పందించడం లేదని ఆరోపించారు.

ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని విమర్శించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పద్మశాలి కుటుంబాలకు బతుకమ్మ చీరల బకాయిలు పెండింగ్‌లో పెట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలను చెల్లించి నేత కార్మికులను ఆదుకున్నామని సూర దేవరాజు తెలిపారు.

అలాగే స్థానికంగా చోటుచేసుకున్న నేత కార్మికుడు వెంకటేష్ అదృశ్యం, అనంతరం మృతదేహం లభ్యమైన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గాన్ని వదిలి హైదరాబాద్ రాజకీయాలకే పరిమితమయ్యారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. సిరిసిల్ల ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే పదవికి న్యాయం చేయలేని పరిస్థితి ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

“సిరిసిల్ల ప్రజలకు కేటీఆర్ కనబడటం లేదు.. ప్రజల సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే పదవి మీకు ఎందుకు?” అంటూ ప్లకార్డులతో కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎండీ రియాజ్, కౌన్సిలర్లు కూరపాటి శ్రీశైలం, లింగంపల్లి గంగరాజు, బొద్దుల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి మంగ కిరణ్, దుబ్బాల వెంకటేశం, స్వర్గం రాజు, కోడం అరుణ, బైరి ప్రభాకర్, వంతడుపుల రాము, కంసాల మల్లేశం, దేవదాసు, శ్రీగద మైసయ్య, పిట్టల శ్రీకాంత్, నక్క నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story