Sircilla: రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ రూ. 7,135 కోట్లు!

Sircilla: రైతు భరోసా నిధుల విడుదలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సంబరాలు . పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ప్రభుత్వ పెద్దల చిత్రపటాలకు పాలాభిషేకం

KALEEM, SIRICILLA
Published on: 8 July 2026 7:41 PM IST
Sircilla
X

Sircilla: రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ రూ. 7,135 కోట్లు!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతు భరోసా నిధుల విడుదలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. సిరిసిల్లలో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పాలాభిషేకం చేశారు.

అన్నదాతలకు పెట్టుబడి సాయంగా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడతల వారీగా విడుదల చేస్తుండటంతో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ పెద్దల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్‌కు ముందే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయడం ద్వారా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని అన్నారు. ఎకరాల పరిమితి లేకుండా అర్హులైన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందజేస్తోందని, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వ్యవసాయాన్ని పండుగలా మార్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా జూలై 4, 2026 నాటికి 67.44 లక్షల మంది రైతులకు, 1.18 కోట్ల ఎకరాలకు రూ.7,135.77 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story