Huzurabad: కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ వొడితల ప్రణవ్ జన్మదిన పోస్టర్ ఆవిష్కరణ!
Huzurabad: హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ వొడితల ప్రణవ్ బాబు జన్మదినం (ఆగస్టు 15) పురస్కరించుకుని జమ్మికుంటలో పోస్టర్ ఆవిష్కరణ.
Huzurabad: కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ వొడితల ప్రణవ్ జన్మదిన పోస్టర్ ఆవిష్కరణ!
హుజరాబాద్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కొత్తపల్లి లో మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ స్వప్నకోటి ఇంటి వద్ద హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ బాబు జన్మదినం సందర్భంగా బొంగోని వీరన్న మర్రి రామ్ రెడ్డి పంజాల అజయ్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించినారు.
వారు మాట్లాడుతూ ప్రణవ్ బాబు రాజకీయంలో ఈ తరానికి క్లీన్ చిట్ నేతగా గుర్తింపు.రాజకీయంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలో ప్రజాధారణ పొంది ఈ ప్రాంత ఆశాకిరణంగా భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా నిలుస్తున్న మంచి నాయకుడు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు అని అన్నారు.
ప్రజల కోసం పదవి లేకున్నా సేవ చేయడం కేవలం ప్రణవ్ బాబుకే సాధ్యమని,తాత వారసత్వాన్ని అందిపుచ్చుకొని తాతకి తగ్గ మనవడిగా రాజకీయంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడని,భవిష్యత్ లో ఈ ప్రాంతం నుండి ప్రజలకు సేవ చేసే భాగ్యం,భగవంతుడు ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు 15వతేది జన్మదినం జరగబోయే రోజు నా యూత్ కాంగ్రెస్,ఎన్ఎస్ యూఐ,యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాట్లు చేస్తున్నట్టు యూత్ కాంగ్రెస్ నాయకులు బొడిగె శ్రీకాంత్ ఎండి సజ్జు తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో సినియర్ నాయకుడు దేశీని స్వప్న కోటి . ఎర్రం సతీష్ రెడ్డి. పెద్ది కుమార్ జిల్లెల్ల తిరుపతిరెడ్డి. రామారావు. కౌన్సిలర్ చందా రాజు. కూతాడు తిరుపతి. మాచర్ల రాజు. ఒగ్గు రమేష్. ఎగిత సుజాత అశోక్. పాతకాల మౌనిక అనిల్. యాట్ల సునీత అశోక్. బుడిగ శ్రీకాంత్. ఎండి సజ్జు.మహిళా కాంగ్రెస్ నాయకులు తోట స్వప్న పిడుగు భాగ్యలక్ష్మి మాజీ కౌన్సిలర్ శ్రీహరి వార్డ్ అధ్యక్షులు టెంకురాల కిషోర్ ఆడెపు దేవరాజ్ రాజేష్ రాజకుమార్ ఏం సి డైరెక్టర్ సూర్య రాజేశ్వరరావు తిరుపతి రెడ్డి దేవస్థాన డైరెక్టర్ చిరంజీవి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




