Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా 'ప్రజా పాలన' వెయ్యి రోజుల సంబరాలు
Karimnagar: కరీంనగర్ నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల ప్రజా పాలన వేడుకలు ఘనంగా జరిగాయి.
Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా 'ప్రజా పాలన' వెయ్యి రోజుల సంబరాలు
కరీంనగర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో 1000 రోజుల ప్రజా పాలన - ప్రజా సంక్షేమ దినోత్సవాలను పురస్కరించుకుని నేడు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ వద్ద సంబరాలు నిర్వహించి, నగరంలోని ప్రధాన వీధుల గుండా భారీ బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది.
ఈ ర్యాలీ ఇందిరా చౌక్ నుండి ప్రారంభమై రాజీవ్ చౌక్, గాంధీ చౌక్, బాబు జగ్జీవన్ రావ్ చౌక్ మీదుగా అంబేద్కర్ చౌక్ వరకు సాగింది.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు వెలి చాలా రాజేందర్ రావు,ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి, పురుమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పేదలకు అందుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 75 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు.
కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రతి పథకం పారదర్శకంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ నేరుగా చేరుతోంది. గత పాలనలో మాదిరిగా ఫామ్ హౌస్ పాలన కాదు, ఇది ప్రజల గడప వద్ద పాలన. మహాలక్ష్మి, గృహజ్యోతి, చేయూత వంటి పథకాలతో ప్రతి ఇంట్లో వెలుగులు నింపాం. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపాం.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హృదయపూర్వక ధన్యవాదాలు.
ప్రతిపక్షాలు ఫామ్ హౌస్ లో నిద్రపోతున్న కేసీఆర్ ను లేపడానికి చార్జ్ షీట్ పేరుతో నాటకాలు ఆడుతున్నాయి. తెలంగాణ ప్రజలు మాత్రం ప్రజా పాలనను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో కరీంనగర్ ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాం" అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఏఎంసీ చైర్మన్ ఆకుల నర్సయ్య, ఆకారపు భాస్కర్ రెడ్డి, ఎండి తాజ్, శ్రావణ్ నాయక్, వరాల నర్సింగం, సిహెచ్. బుచ్చి రెడ్డి, కాంతాల జగన్ రెడ్డి, పడాల అజయ్ గౌడ్, వెన్నం రజిత రెడ్డి, మునిగంటి అనిల్, రేగొండ సందీప్, ఇమ్రాన్, వంగల విద్యాసాగర్, మూల కృష్ణారెడ్డి, పర్వత మల్లేశం, మడుపు మోహన్, కామ్ రెడ్డి రామ్ రెడ్డి, సాయిని తిరుపతి, శిల్ప, ఫహాద్, రాచకొండ ప్రభాకర్, మాదాసు శ్రీనివాస్, మల్లారెడ్డి, కోడూరు రవీందర్ గౌడ్, ఆసిఫ్,గడప అజయ్, అట్టెపు వేణు, టేల భూమయ్య, చింతల కిషన్, దన్న సింగ్, కూర నరేష్ రెడ్డి, వేల్పుల వెంకటేష్, అబ్దుల్ రహమాన్, లింగంపల్లి బాబు, దండి రవీందర్, గాండ్ల అంజయ్య, వీర దేవేందర్, విక్టర్, అమీర్, హాజీ, గోపు మల్లారెడ్డి, ఖలీముద్దీన్, కాశి పాక రాకేష్, నిహాల్, ఇమ్రాన్ఘని, కంకణాల అనిల్, సత్తినేని శ్రీకాంత్, లాయకు, కర్రె పావని, మాజీద్ అలీ ఖాన్, తోట అంజయ్య, కూన దామోదర్, మాలోతు మహాలక్ష్మి, మార్కరాజు, నెల్లి నరేష్, ఫజల్, పెంట శేఖర్, ఖలీల్, స్వప్న శ్రీ, గసగంటి కుమార్ రంగ నాయక్, సుధాకర్ నాయక్, బషీరుద్దీన్, రాచర్ల పద్మ,అందశంకర్, యనముల మంజుల, సుంకర గణపతి, గడప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




