Thangallapalli: తంగళ్లపల్లిలో కాంగ్రెస్‌ 1000 రోజుల పాలన సంబురాలు!

Thangallapalli: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తంగళ్లపల్లిలో భారీ ర్యాలీ. అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు.

KALEEM, SIRICILLA
Published on: 8 Sept 2026 1:03 PM IST
Thangallapalli
X

Thangallapalli: తంగళ్లపల్లిలో కాంగ్రెస్‌ 1000 రోజుల పాలన సంబురాలు!

Thangallapalli: కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు మునిగెల రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు.

డప్పుచప్పుళ్లు, కాంగ్రెస్‌ నినాదాలతో మండల కేంద్రంలో సందడి నెలకొంది. ర్యాలీగా అంబేద్కర్‌ విగ్రహం వద్దకు చేరుకున్న కాంగ్రెస్‌ నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

బీఆర్‌ఎస్‌ పాలనపై విమర్శలు ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ పాలనలో సంక్షేమం కుంటుపడిందని విమర్శించారు. అధికారం అడ్డుపెట్టుకుని పేదలను దోచుకున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఆరు గ్యారంటీల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.

ప్రజా పాలనకు వెయ్యి రోజులు పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజా పాలన సాగిస్తున్నామని కాంగ్రెస్‌ నాయకులు వెల్లడించారు.

వెయ్యి రోజుల పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story