Karimnagar: గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి: ప్రఫుల్ దేశాయ్

Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను గడువులోగా పూర్తి చేయాలని బిఎల్ఓలు, సూపర్ వైజర్లను కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 23 July 2026 11:31 AM IST
Karimnagar
X

Karimnagar: గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి: ప్రఫుల్ దేశాయ్

కరీంనగర్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ( ఎస్ఐఆర్) ప్రక్రియను మరింత వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీస్కోవాలని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ బిఎల్ఓ, బిఎల్ఓ సూపర్ వైజర్లు, మానిటరింగ్ అధికారులను ఆదేశించారు.

కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయం నుండి కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ టెలికాన్ఫరెన్ నిర్వహించారు. నగరంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ తీరును ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, ఆన్ లైన్ నమోదు ప్రక్రియ తో పాటు బిఎల్ఓ, సూపర్ వైజర్ల వారిగా ఎస్ఐఆర్ పర్సెంటేజ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రక్రియ వేగవంతం పలు సూచనల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ సంధర్బంగా కమీషనర్ టెలికాన్ఫరెన్ ద్వారా మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో పారదర్శకత ను పాటించి గడువులోగా పూర్తి చేయాలన్నారు.

మరో మూడు రోజుల్లో 95% పూర్తయ్యేలా తగిన చర్యలు తీస్కోవాలన్నారు.

పూరోగతి తక్కువ ఉన్న బూతుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎప్పటికప్పుడు ఎన్యుమరేషన్ ఫారాలను బిఎల్ఓ లు భాధ్యతగా ఆన్ లైన్ నమోదు చేయించాలని ఆదేశించారు.

నివాసాలు మారిన, మరణించిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డుల్లో నమోదు చేయాలన్నారు.

ఓటర్ జాబితాలో ఒక్క ఓటు తప్పిపోకుండ జాగ్రత్తలు తీస్కోవాలన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story