Karimnagar: కరీంనగరంలో వీధి కుక్కల నియంత్రణ ఆపరేషన్లు షురూ!
Karimnagar: వీధి కుక్కల జనన నియంత్రణ (బర్త్ కంట్రోల్) ఆపరేషన్లను నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు.
Karimnagar: కరీంనగరంలో వీధి కుక్కల నియంత్రణ ఆపరేషన్లు షురూ!
కరీంనగర్: కుక్కల జనన నియంత్రణ ఆపరేషన్లను ప్రారంభంచేసి నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. నగర ప్రజల రక్షణ ఆరోగ్య భధ్రత నేపథ్యంలో బొమ్మకల్ ప్రాంతంలో గల నగరపాలక సంస్థ జంతు సంరక్షణ జనన నియంత్రణ కేంద్రాన్ని వెటర్నరీ, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ సందర్శించారు.
ఆపరేషన్ థియేటర్ తో పాటు పోస్ట్, ఫ్రీ ఆపరేటీవ్ కెనల్స్ ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి పరిశీలించారు. కెనల్స్ లో పట్టి ఉంచిన కుక్కల సంరక్షణ వివరాలను అడిగి తెలుసుకొని జనన నియంత్రణ కేంద్రం లో అదనపు వసతి సౌకర్యాలు, ఆపరేషన్ల నిర్వాహణా తీరు తదితర విషయాల పై సూచనలు చేస్తూ... ఆదేశాలు జారీ చేశారు. జనన నియంత్రణ కేంద్రం చుట్టు పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించి... స్థలం హద్దుల గుర్తింపు పై టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ ప్రజల రక్షణ మరియు ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని నగరపాలక సంస్థ ఆద్వర్యంలో నగరంలోని కుక్కల జనన నియంత్రణ ఆపరేషన్లను ప్రారంభించామని తెలిపారు. భారత జంతు సంరక్షణ బోర్డు మార్గదర్శకాలు, నిబంధనలను అనుసరిస్తూ కుక్కలకు బర్థ్ కంట్రోల్ ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు.
నగర వ్యాప్తంగా వీది కుక్కల సమస్యల పై ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను, వాటి ద్వారా జరిగే ప్రమాద తీవ్రతను ప్రాధాన్యత క్రమంలో తీస్కోవాలని అధికారులకు సూచించారు. నగరంలో నివాస ప్రాంతాల్లో కుక్కలను పట్టుకొని వాటికి నిబంధనల ప్రకారం బర్థ్ కంట్రోల్ ఆపరేషన్లు, యాంటీ రేబిస్ వాక్సిన్లు వేయాలని ఆదేశించారు. శస్త్రచికిత్స అనంతరం పోస్ట్ ఆపరేటీవ్ కేర్ వార్డులలో 5 రోజులు సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
జనన నియంత్రణ కేంద్రంలో కుక్కల సంరక్షణ కోసం అదనంగా నిర్మించే 66 కెనల్స్ పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జనన నియంత్రణ కేంద్రానికి సంబంధించిన స్థల వివాదాలు లేకుండ ఉండేందుకు టౌన్ ప్లానింగ్, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో సర్వే చేపట్టి హద్దులను త్వరగా గుర్తించాలని సూచించారు.
జనన నియంత్రణ కేంద్రం యొక్క స్థల హద్దుల ప్రకారం ఇంజనీరింగ్ అధికారులు వెంటనే కంపోండ్ వాల్ నిర్మాణం పనులు చేపట్టాలని ఆదేశించారు. "నగర ప్రజల రక్షణే మా మొదటి ప్రాధాన్యతగా వీది కుక్కల నియంత్రణ లో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అధికారి దుర్గాప్రసాద్ రెడ్డి, డీసిపి బషిరొద్దిన్, ఇంజనీరింగ్ అధికారులు డాగ్ క్యాచర్ సిబ్బంది పాల్గొన్నారు.




