Manthani: అలరించిన కమాన్‌పూర్ చిన్నారుల నృత్య ప్రదర్శనలు!

Manthani: సిల్వర్ జూబ్లీ డ్యాన్స్ పోటీల్లో కమాన్‌పూర్ కంఫర్ట్ విద్యార్థులు అద్భుత ప్రదర్శనతో ప్రతిభ కనబరిచి బహుమతులు గెలుచుకున్నారు.

SHANKAR, MANTHANI
Published on: 17 Aug 2026 7:55 PM IST
Manthani
X

Manthani: అలరించిన కమాన్‌పూర్ చిన్నారుల నృత్య ప్రదర్శనలు!

మంథాని: స్టార్ డ్యాన్స్ అకాడమీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్‌లోని కళాభారతిలో నిర్వహించిన డ్యాన్స్ పోటీల్లో పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన కంఫర్ట్ విద్యార్థులు తమ అద్భుత నృత్య ప్రదర్శనలతో ప్రతిభ సాధించారు.

వివిధ విభాగాల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు ప్రతిభను చాటుతూ ప్రేక్షకులను అలరించారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలకు విశేష స్పందన లభించింది. అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను స్టార్ డ్యాన్స్ అకాడమీ నిర్వాహకులు కౌశల్ ధనరాజ్, బిట్ బిట్ డ్యాన్స్ అకాడమీ నిర్వాహకులు తుమ్మల విజయ్, డ్యాన్స్ మాస్టర్ పులిపాక దేవ అభినందించారు. విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులు అందజేసి సత్కరించారు. చిన్నారుల ప్రతిభను నిర్వాహకులు, తల్లిదండ్రులు అభినందించారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story