Sircilla: గడువులోగా రాజన్న ఆలయ విస్తరణ పనులు పూర్తి చేయాలి: కలెక్టర్!
Sircilla: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన విస్తరణ, అభివృద్ధి పనులను ప్రణాళిక ప్రకారం వేగవంతంగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Sircilla: గడువులోగా రాజన్న ఆలయ విస్తరణ పనులు పూర్తి చేయాలి: కలెక్టర్!
సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను ప్రణాళిక ప్రకారం వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
వేములవాడ పట్టణంలో వీటీఏడీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం నిర్మాణం, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులపై కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిత్యాన్నదాన సత్రం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అవసరమైన మేరకు కూలీల సంఖ్యను పెంచాలని సూచించారు.
అనంతరం బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ప్రణాళిక ప్రకారం గడువులోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులు నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ఆర్‌అండ్‌బీ సీఈ రాజేశ్వర్ రెడ్డి, ఎస్‌ఈ భీమ్లా నాయక్, ఆలయ ఈవో రమాదేవి, ఆర్‌అండ్‌బీ డీఈ శాంతయ్య, స్థపతులు మోతిలాల్, సూర్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.




