Sircilla: హెల్త్ సబ్ సెంటర్లపై కలెక్టర్ ఫోకస్.. త్వరలోనే ప్రారంభం!

Sircilla: సిరిసిల్ల జిల్లాలో నిర్మాణంలో ఉన్న హెల్త్ సబ్ సెంటర్లను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 10 Sept 2026 6:52 PM IST
Sircilla
X

Sircilla: హెల్త్ సబ్ సెంటర్లపై కలెక్టర్ ఫోకస్.. త్వరలోనే ప్రారంభం!

సిరిసిల్ల: జిల్లాలో తుది దశలో ఉన్న హెల్త్ సబ్ సెంటర్ల భవన నిర్మాణ పనులను ప్రణాళిక ప్రకారం వేగంగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.

ఎన్‌హెచ్‌ఎం, 15వ ఆర్థిక సంఘం తదితర నిధులతో పంచాయతీరాజ్ శాఖ, టీజీఎంఎస్‌ఐడీసీ ఆధ్వర్యంలో జిల్లాలో చేపడుతున్న హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణ పనులపై కలెక్టర్ గురువారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం కింద నిర్మించిన 9 సబ్ సెంటర్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన ఒక సబ్ సెంటర్ కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. మరో ఆరు భవనాల నిర్మాణ పనులు తుది దశలో ఉన్నట్లు కలెక్టర్‌కు వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుది దశలో ఉన్న పనులను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సబ్ సెంటర్లలో నీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి అన్ని మౌలిక వసతులు కల్పించి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. పనుల పురోగతిని ఆయా శాఖల జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు.

సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ఈఈ సుదర్శన్ రెడ్డి, టీజీఎంఎస్‌ఐడీసీ ఈఈ విశ్వప్రసాద్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story