Sircilla: భూముల రీసర్వే పకడ్బందీగా పూర్తి చేయాలి: కలెక్టర్ గరిమ!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూముల రీసర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 19 Aug 2026 10:26 PM IST
Sircilla
X

Sircilla: భూముల రీసర్వే పకడ్బందీగా పూర్తి చేయాలి: కలెక్టర్ గరిమ!

సిరిసిల్ల: జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. రీసర్వేకు ముందు ఆయా గ్రామాల ప్రజలకు సమాచారం అందించాలని, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను పరిశీలించాలని సూచించారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో భూముల రీసర్వేపై రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి నిర్వహించిన సమావేశంలో రీసర్వే పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో గంభీరావుపేట మండలం శ్రీనివాసపురం, కోనరావుపేట మండలం లచ్చపేట, వేములవాడ మండలం చంద్రగిరి, చందుర్తి మండలం అనంతపల్లి గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. మరో పది గ్రామాల్లో ప్రస్తుతం సర్వే ప్రారంభించినట్లు తెలిపారు.

ఇప్పటికే సర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించిన రికార్డులను ఆయా మండలాల తహసీల్దార్లకు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. మిగతా గ్రామాల్లో రీసర్వే ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేయాలని సూచించారు.

క్షేత్రస్థాయిలో భూముల వివరాలను పక్కాగా సేకరించాలని, రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని రీసర్వేను పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో సర్వే ప్రారంభానికి ముందే జీపీఓలు, ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా సంబంధిత సర్వే నంబర్ల భూముల వివరాలను ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.

గ్రామ సరిహద్దుల రీసర్వేతో పాటు ఇతర పనులను తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన భూముల వివరాలను ఆయా శాఖల అధికారులకు అందజేయాలని తెలిపారు. క్షేత్రస్థాయి, రికార్డుల్లోని వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తదుపరి ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు శ్రీధర్ బాబు, కే.ఎస్.బీ. కుమారి, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, ఆయా మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story