Sircilla: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుపై కలెక్టర్ ఫోకస్!
Sircilla: జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ గరిమ అగ్రవాల్ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ పై విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి, డిజిటల్ వసతులపై ఆదేశాలిచ్చారు.
Sircilla: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుపై కలెక్టర్ ఫోకస్!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను మరింత మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI)పై జిల్లా విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు.
ఇంగ్లీష్, గణితం, సైన్స్ వంటి ప్రధాన సబ్జెక్టుల్లో విద్యార్థుల ప్రతిభ పెరిగేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అలాగే జిల్లా విద్యాధికారి ఎంఈఓలు, హెచ్ఎంలతో క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
ప్రతి పాఠశాలను నిరంతరం తనిఖీ చేసి, తనిఖీ వివరాలను నమోదు చేయాలని, ఉపాధ్యాయ శిక్షణ, కంప్యూటర్లు, ట్యాబ్లు, ఇంటర్నెట్, ఐఎఫ్బీ ప్యానెల్స్, మరుగుదొడ్లు, తరగతి గదులు తదితర మౌలిక సదుపాయాల సమాచారాన్ని ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
విద్యా రంగంలో జిల్లా ఉత్తమ పనితీరు కనబరిచేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.




