Tangallapalli: గురుకులంలో కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులతో కలిసి భోజనం
Tangallapalli: మండేపల్లి టీజీటీడబ్ల్యూయూ ఆర్జేసీ విద్యాలయాన్ని కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. భోజన నాణ్యత పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించారు.
Tangallapalli: గురుకులంలో కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులతో కలిసి భోజనం
తంగళ్లపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం మండేపల్లి టీజీటీడబ్ల్యూయూ ఆర్జేసీ విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల చదువు, భోజన నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
విద్యార్థులు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
మండేపల్లిలోని టీజీటీడబ్ల్యూయూ ఆర్జేసీ విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ ముందుగా స్టోర్‌రూమ్‌లో బియ్యం, పప్పులు, గుడ్లు తదితర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు వడ్డించిన భోజనాన్ని తనిఖీ చేసి, మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందిస్తున్నారా అని ఆరా తీశారు.
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారితో ముచ్చటించిన కలెక్టర్, కోడిగుడ్లు, పాలు, ఇతర పోషకాహారం క్రమం తప్పకుండా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.




