Sircilla: సెప్టెంబర్ 5, 6, 12, 13 తేదీల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక ప్రచారం: కలెక్టర్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెప్టెంబర్ 5, 6, 12, 13 తేదీల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడించారు.

KALEEM, SIRICILLA
Published on: 2 Sept 2026 10:38 PM IST
Sircilla
X

Sircilla: సెప్టెంబర్ 5, 6, 12, 13 తేదీల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక ప్రచారం: కలెక్టర్!

సిరిసిల్ల: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ రోజుల్లో సంబంధిత పోలింగ్ స్టేషన్లలో బూత్ లెవల్ అధికారులు (BLOs) అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు. బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs) కూడా నిర్దేశిత ప్రదేశాల్లో హాజరవుతారని పేర్కొన్నారు.

BLOలు, BLAs సమక్షంలో ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించేందుకు ఓటర్లకు అవకాశం కల్పించనున్నారు. జాబితాలో పేర్లు, వివరాల్లో ఉన్న తప్పులు, సవరణలు, ఇతర లోపాలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని తెలిపారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులు, ఓటర్లు ప్రత్యేక ప్రచార కార్యక్రమాల రోజుల్లో తమకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించుకోవాలని కలెక్టర్ సూచించారు.

అలాగే ఓటర్ల జాబితాకు సంబంధించి క్లెయిమ్‌లు, అభ్యంతరాలను ERO/AERO కార్యాలయాల్లో సమర్పించవచ్చని తెలిపారు. ఫారం-6, ఫారం-7, ఫారం-8 ద్వారా కూడా తమ క్లెయిమ్‌లు, అభ్యంతరాలను దాఖలు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story