Sircilla: ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం అపార్ ఐడీలు పూర్తి కావాలి కలెక్టర్

Sircilla: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ 'ప్రగతి పోర్టల్' ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలు, మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఉన్నత స్థాయి సమీక్ష.

KALEEM, SIRICILLA
Published on: 9 July 2026 10:33 PM IST
Sircilla
X

Sircilla: ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం అపార్ ఐడీలు పూర్తి కావాలి కలెక్టర్

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రగతి పోర్టల్‌పై సమీక్ష నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న పలు కార్యక్రమాల పురోగతిని పరిశీలించారు. సమగ్ర శిక్ష, పీఎం పోషణ్ అభియాన్, అపార్ ఐడీ, మధ్యాహ్న భోజన పథకం అమలుపై అధికారులను ప్రశ్నించారు.

అపార్ ఐడీలను 100 శాతం పూర్తి చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఖాళీ స్థలాల్లో కూరగాయలు, మునగ మొక్కలు నాటాలని సూచించారు. విద్యార్థులకు హిమోగ్లోబిన్ పరీక్షల కోసం ప్రత్యేక షెడ్యూల్ రూపొందించాలని తెలిపారు.

పదో తరగతి తర్వాత విద్యార్థులు చదువు మానేయకుండా ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలని, మండల విద్యాధికారులు ప్రతి పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story