Karimnagar: అల్గునూరు గురుకులంలో కలెక్టర్ సర్‌ప్రైజ్ విజిట్!

Karimnagar: కరీంనగర్ జిల్లా అల్గునూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ చిత్రా మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 April 2026 12:27 PM IST
Karimnagar
X

Karimnagar: అల్గునూరు గురుకులంలో కలెక్టర్ సర్‌ప్రైజ్ విజిట్!

కరీంనగర్ జిల్లా: ఉపాధ్యాయ బృందం స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను అన్నిరంగాల్లో ఎక్స్ లెంట్ గా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. విద్యార్థులు కఠోరంగా శ్రమిస్తూ విద్యను అభ్యసించి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు శివారులో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభ కేంద్రాన్ని (టీజీఎస్ బ్ల్యూ ఆర్ స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్) ను బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పదవ తరగతి, ఇంటర్ విద్యార్థుల తరగతి గదులను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యా బోధనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినిలు ఎలా చదువుతున్నారు.. విద్యా బోధన ఎలా ఉంది.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. బ్రేక్ ఫాస్ట్ ఫుడ్ మంచిగా పెడుతున్నారా..అని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు. పదవ తరగతి తర్వాత ఏ గ్రూపులు తీసుకుంటారు.. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ లో ఏ గ్రూపులపై ఆసక్తి ఉంది అని తెలుసుకున్నారు. విద్యాబోధన ఎలా ఉంది.. ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని జిల్లా కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. గురుకులంలో ఉపాధ్యాయులు చక్కగా విద్యను బోధిస్తున్నారని బ్రేక్ ఫాస్ట్ ఫుడ్ మెనూ ప్రకారం మంచిగా పెడుతున్నారని జిల్లా కలెక్టర్ కు వివరించారు. జిల్లా కలెక్టర్ తరగతి గదులతో పాటు వాష్రూమ్స్, కిచెను, డైనింగ్, స్టోర్ రూమ్ ను పరిశీలించారు. కూరగాయలను బియ్యము ఇతర సామాగ్రిని పర్యవేక్షించారు.

విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దాలి..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సాంఘిక సంక్షేమ శాఖ డిడి, ప్రిన్సిపాల్ కు పలు సూచనలు చేశారు. గురుకులంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మంచి ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయ బృందం కటోరంగ శ్రమించాలన్నారు. విద్యార్థులకు అత్యుత్తమ విద్యను బోధించి మంచి పేరు తీసుకురా వాలన్నారు. వారిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని పేర్కొన్నారు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య పరంగా ఏ అవసరం ఉన్న వెంటనే స్పందించాలని ఆదేశించారు. గురుకులం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గురుకులంలో ఎప్పటికప్పుడు చెత్తాచెదారం లేకుండా క్లీన్ గా ఉంచుకోవాలనీ, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం బ్రేకు ఫాస్ట్ భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రిన్సిపాల్ కు సూచించారు. విద్యార్థులకు ఏ లోటు రాకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ తిరుపతిరావు స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ప్రిన్సిపాల్ మాధవి తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story