Karimnagar: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఇకపై ప్రతి 3 నెలలకోసారి జాబ్ మేళా!
Karimnagar: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రకటించారు.
Karimnagar: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఇకపై ప్రతి 3 నెలలకోసారి జాబ్ మేళా!
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో మూడు నెలలకోసారి జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. జాబ్ మేళా నిర్వహణ తీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది యువతీ యువకులు వచ్చారు.. ఏ కంపెనీ అవకాశం కల్పించారు అని ఆరా తీశారు.. వసతుల కల్పన పై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు అందరూ సమన్వయంతో జాబ్ మేళాను విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. రాబోయే రోజుల్లోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని జాబ్ మేళాలను ఏర్పాటు చేద్దామని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో ఉద్యోగులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వారి ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడుతామని జిల్లా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.




