Sircilla: బడికి గదులు కరువు హనుమాన్ గుడి రేకుల కింద ప్రాథమిక పాఠశాల!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారంలో తరగతి గదుల కొరత. హనుమాన్ ఆలయం రేకుల కింద విద్యార్థులకు బోధన, మధ్యాహ్న భోజన గదిలోనే ప్రీ-ప్రైమరీ.
Sircilla: బడికి గదులు కరువు హనుమాన్ గుడి రేకుల కింద ప్రాథమిక పాఠశాల!
Sircilla: పాఠశాలలో తరగతి గదుల కొరతతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం 29 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు.
గతంలో పాఠశాలలో రెండు తరగతి గదులు ఉండగా.. ఒక గది శిథిలావస్థకు చేరడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగించారు. దీంతో ప్రస్తుతం ఒక్క గదిలోనే ఐదు తరగతులను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒకే గది అన్ని తరగతులకు సరిపోకపోవడంతో.. పాఠశాల పక్కనే ఉన్న హనుమాన్ ఆలయ ఆవరణలోని రేకుల కింద కొన్ని తరగతులకు పాఠాలు బోధిస్తున్నారు. దీంతో విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు.
మరోవైపు పాఠశాలకు ప్రీ-ప్రైమరీ తరగతులు కూడా మంజూరయ్యాయి. ప్రత్యేక గది లేకపోవడంతో మధ్యాహ్న భోజన గదిలోనే ఇన్‌స్ట్రక్టర్, ఆయా ఐదుగురు చిన్నారుల సంరక్షణను చూస్తున్నారు.విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదులు మంజూరు చేసి సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు స్పందించి పాఠశాలకు అవసరమైన గదులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.




