Siricilla: వెంకంపేటలో ఇరు వర్గాల ఘర్షణ.. నలుగురికి తీవ్ర గాయాలు!

Siricilla: సిరిసిల్ల వెంకంపేటలో పాత కక్షలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, కర్రలతో దాడులు. నలుగురికి తీవ్ర గాయాలు, రంగంలోకి దిగిన పోలీసులు.

KALEEM, SIRICILLA
Published on: 14 Sept 2026 10:37 AM IST
Siricilla
X

Siricilla: వెంకంపేటలో ఇరు వర్గాల ఘర్షణ.. నలుగురికి తీవ్ర గాయాలు!

Siricilla: సిరిసిల్ల వెంకంపేటలో ఆదివారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ వర్గానికి చెందిన తండ్రి, కొడుకులిద్దరికీ తలలకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

పద్మశాలి యువజన సంఘం ఎన్నికల్లో పోటీ చేసిన యువకుల మధ్య ఉన్న పాత విభేదాలే ఘర్షణకు కారణమని తెలుస్తోంది. ఆదివారం రాత్రి ఇరు వర్గాలు ఒక్కసారిగా కర్రలతో పరస్పరం దాడులకు దిగడంతో వెంకంపేటలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని స్థానికులు సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు.

ఈ ఘటనపై ఇరు వర్గాలు సిరిసిల్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ఘర్షణకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA