Sircilla: నేడు సీఐటీయూ టెక్స్టైల్ కో-ఆర్డినేషన్ కమిటీ సదస్సు!
Sircilla: సిరిసిల్లలో ఆగస్టు 23న సీఐటీయూ టెక్స్టైల్ కో-ఆర్డినేషన్ కమిటీ సదస్సు. కార్మికుల సమస్యలు, కనీస వేతనాలు, సంక్షేమ పథకాలపై చర్చ.
Sircilla: నేడు సీఐటీయూ టెక్స్టైల్ కో-ఆర్డినేషన్ కమిటీ సదస్సు!
Sircilla: టెక్స్టైల్ రంగ కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల 23న సిరిసిల్లలో టెక్స్టైల్ కో-ఆర్డినేషన్ కమిటీ సదస్సు నిర్వహించనున్నారు. ఆగస్టు 23న ఉదయం 10:30 గంటలకు గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్లో జరిగే ఈ సదస్సుకు తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాల నుంచి టెక్స్టైల్, పవర్లూమ్ రంగ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు హాజరుకానున్నారు.
టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్ తదితర సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సదస్సు ఏర్పాట్లపై సీఐటీయూ నాయకులు కోడం రమణ మీడియాతో మాట్లాడుతూ.... టెక్స్టైల్, పవర్లూమ్ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వాటి పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.
పవర్లూమ్ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, టెక్స్టైల్ పార్కుల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, విద్యుత్ సబ్సిడీ అమలు చేయాలని నాయకులు కోరుతున్నారు. అలాగే మహిళా శక్తి పథకాన్ని పవర్లూమ్ కార్మికులకు వర్తింపజేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సీఐటీయూ ప్రధాన డిమాండ్లు
పవర్లూమ్ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలి. టెక్స్టైల్ పార్కుల్లో ఉద్యోగ భద్రత కల్పించాలి.
విద్యుత్ సబ్సిడీ అమలు చేయాలి. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. పవర్లూమ్ కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సుకు కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలపై సదస్సులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.




