Karimnagar: చొప్పదండిలో ప్రజాపాలన జోరు - 4వ వార్డులో ప్రజా సమస్యలపై చర్చ!

Karimnagar: చొప్పదండి 4వ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలో కౌన్సిలర్ కనుమల్ల రాజశేఖర్ ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్ దరఖాస్తులను స్వీకరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 April 2026 7:57 PM IST
Karimnagar
X

Karimnagar: చొప్పదండిలో ప్రజాపాలన జోరు - 4వ వార్డులో ప్రజా సమస్యలపై చర్చ!

కరీంనగర్ జిల్లా: చొప్పదండి పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 4వ వార్డ్ పరిధిలో వార్డ్ సభ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

పట్టణంలోని సాయిబాబా గుడి సమీపంలో జరిగిన ఈ సమావేశంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర సంవత్సరాల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రజలకు సమగ్ర వివరాలు అందించారు. ప్రజల జీవనోపాధి మెరుగుపడేలా ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను అధికారులు వివరించారు.

అదేవిధంగా, 4వ వార్డ్‌లోని స్థానిక సమస్యలపై ప్రజలతో చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు, నూతన పెన్షన్ పథకాల కోసం వచ్చిన దరఖాస్తులను 4వ వార్డ్ కౌన్సిలర్ కనుమల్ల రాజశేఖర్ స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ముద్దం మల్లేశం గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి అఖిల్ గౌడ్, సోమిడి శ్రీనివాస్, మున్సిపల్ వార్డు అధికారి రమాదేవి, ఆర్‌పి రొడ్డవేని లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వార్డ్ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story