Choppadandi: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాలతో ఆర్టీసీ బస్సు ప్రారంభం

Choppadandi: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం ఆచంపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులు జరిగాయి.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 17 Jun 2026 12:47 PM IST
Choppadandi
X

Choppadandi: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాలతో ఆర్టీసీ బస్సు ప్రారంభం

Choppadandi: కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు గంగాధర మండలం ఆచంపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆరె తేజశ్రీ రాజశేఖర్ ఆధ్వర్యంలో వేములవాడ డిపో నుండి కరీంనగర్ డిపోకు బయలుదేరిన ఆర్టీసీ బస్సును ఆచంపల్లి గ్రామంలో ఘనంగా స్వాగతించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ బస్సు సేవల ప్రారంభాన్ని స్వాగతించారు. అలాగే గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా చింతల తాడే రజిత గార్ల ఇందిరమ్మ ఇంటి వద్ద ముగ్గు కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ జక్కుల అనూష శ్రీనివాస్, పాలవర్గ సభ్యులు సాయి, ఆనంద్, విజయ్, అవినాష్, లక్ష్మణ్, మల్లేశం, వెంకటయ్య, మాజీ ఎంపిటిసి కోలపురం లక్ష్మణ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రుద్ర మల్లేశం, గ్రామ శాఖ అధ్యక్షులు రుద్ర నరసింగం మరియు. గ్రామస్తులు పాల్గొన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story