Choppadandi: చొప్పదండి తోగరుమామిడి వద్ద కొత్త బోర్‌మోటార్ ప్రారంభం!
Choppadandi: కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని తోగరుమామిడి వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన బోర్‌మోటార్‌ను మున్సిపల్ చైర్మన్ వడ్లూరి సరిత శ్రీనివాస్ ప్రారంభించారు.
Choppadandi: చొప్పదండి తోగరుమామిడి వద్ద కొత్త బోర్‌మోటార్ ప్రారంభం!
Choppadandi: కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని తోగరుమామిడి కుంట వద్ద స్థానిక ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఏర్పాటు చేసిన CRI 5HP V4 12 స్టేజ్ బోర్‌మోటార్‌ను మున్సిపల్ చైర్మన్ వడ్లూరి సరిత శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, వేసవి కాలంలో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నీటి సరఫరా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు.
తోగరుమామిడి కుంట వద్ద ఏర్పాటు చేసిన ఈ కొత్త బోర్‌మోటార్ ద్వారా స్థానిక కాలనీలకు నీటి సరఫరా మరింత మెరుగుపడనుందని అధికారులు తెలిపారు. ప్రజలకు నిరంతరాయంగా పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు మున్సిపాలిటీ కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.




