Sircilla: ఘనంగా తెలంగాణ ఉద్యమ నేత చీటి నర్సింగరావు జన్మదిన వేడుకలు!
Sircilla: తంగ్గళ్ళపల్లిలో బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు చీటి నర్సింగరావు జన్మదిన వేడుకలు.
Sircilla: ఘనంగా తెలంగాణ ఉద్యమ నేత చీటి నర్సింగరావు జన్మదిన వేడుకలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగ్గళ్ళపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీలో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత చీటి నర్సింగరావు జన్మదిన వేడుకలను బీఆర్‌ఎస్ తంగ్గళ్ళపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీలోని ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమంలో కేక్ కట్ చేసి చీటి నర్సింగరావు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి, భోజనం ఏర్పాటు చేశారు.
వృద్ధులతో కలిసి జన్మదిన వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. చీటి నర్సింగరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.
Next Story




