Sircilla: జనగణన-2027: సమాచార సేకరణ నాణ్యతగా ఉండాలి!
Sircilla: జనగణన-2027 హ్యాండ్‌బుక్ కోసం సమాచార సేకరణ నాణ్యతగా, ఖచ్చితత్వంతో ఉండాలని రాష్ట్ర జనాభా లెక్కల సంచాలకులు భారతి హోళికేరి ఆదేశించారు. వివరాలు చూడండి.
Sircilla: జనగణన-2027: సమాచార సేకరణ నాణ్యతగా ఉండాలి!
సిరిసిల్ల: జనగణన–2027 సమాచార సేకరణ నాణ్యతగా ఉండాలి: రాష్ట్ర జనాభా లెక్కల సంచాలకులు భారతి హోళికేరి
జనగణన–2027 సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ (డీసీహెచ్‌బీ) కోసం సేకరించే సమాచారాన్ని నాణ్యతతో, ఖచ్చితత్వంతో నమోదు చేయాలని రాష్ట్ర జనాభా లెక్కల సంచాలకులు భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి డీసీహెచ్‌బీ తయారీ, సమాచార సేకరణ, హానరేరియం పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి జిల్లా ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వివిధ శాఖల అధికారులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారతి హోళికేరి మాట్లాడుతూ.. విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, విద్యుత్, వ్యవసాయం, సాగునీరు, చేతివృత్తులు తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో సమగ్రంగా నమోదు చేయాలని సూచించారు. పట్టణాల సమాచారాన్ని ఛార్జ్ ఆఫీసర్లు, గ్రామాల సమాచారాన్ని జీపీఓలు, పంచాయతీ కార్యదర్శుల సమన్వయంతో సేకరించాలని తెలిపారు.
డీసీహెచ్‌బీ పోర్టల్, మొబైల్ అప్లికేషన్ ద్వారా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, విలేజ్ డైరెక్టరీ సమాచారాన్ని 2025 డిసెంబర్ 31ను ప్రామాణిక తేదీగా తీసుకుని సేకరించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ 2026 ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 8 వరకు కొనసాగుతుందని వెల్లడించారు.
జిల్లాలో సంబంధిత అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తయిందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సమాచార సేకరణను పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, జిల్లా జనగణన అధికారి & ముఖ్య ప్రణాళిక అధికారి పీబీ శ్రీనివాసాచారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




