Huzurabad: రోడ్డుపై అక్రమ గద్దెలే ప్రమాదానికి కారణం.. బీఎస్పీ ఆందోళన!

Huzurabad: రీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన బీఎస్పీ కార్యకర్త కొయ్యేడ మధు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

GANESH, JAMMIKUNTA
Published on: 16 July 2026 7:44 PM IST
Huzurabad
X

Huzurabad: రోడ్డుపై అక్రమ గద్దెలే ప్రమాదానికి కారణం.. బీఎస్పీ ఆందోళన!

హుజురాబాద్: కరీంనగర్ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ లో పని చేస్తున్న సైదాపూర్ మండలం రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన కొయ్యేడ మధు నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా హుజురాబాద్ లోని సివిల్ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు.

పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లే ప్రశాంత్ గౌడ్ తో మరియూ పార్టీ నాయకులతో కలిసి అడ్వకేట్ నిషాని రామచంద్రం సివిల్ ఆసుపత్రి కి వచ్చి కార్యకర్త కుటుంబానికి ధైర్యం చెప్పి దహన సంస్కారాలకు పార్టీ కార్యకర్తల సహాయంతో పది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.కార్యకర్త మరణ వార్త విని ఆసుపత్రి కి కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు భారీగా తరలి వచ్చి కార్యకర్త కుటుంబానికి బాసట గా నిలబడినారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన అతడి కూతురు అక్షిత (8 సంవత్సరాలు) మెరుగైన చికిత్స కోసం వరంగల్ లోని ఎం జి ఎమ్ ఆసుపత్రికి తరలించారు.

బీఎస్పీ ఛీఫ్ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం ఎంజిఎం వైద్యుల తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మధు మరణానికి కారణమైన కడారి రాజశేఖర్ పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాహనాల తనికి లో ఫైన్ వేసి చలాన్లు వసూలు చేసే పోలీసులు ఇన్సురెన్స్ కట్టించే విధంగా వాహన దారులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరినారు. చింతల పల్లి గ్రామం లో గ్రామ పంచాయతీ నిబంధనలను ఉల్లంఘించి రోడ్డుపై గద్దెలు నిర్మించడం వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరామర్శ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె ప్రశాంత్ గౌడ్ , పార్లమెంట్ ఇంచార్జ్ దొడ్డే శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి ఇల్లెందు రమేష్ , హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి లు వేల్పుల మళ్లేశం అంబాల ప్రభు , హుస్నాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ అధ్యక్షులు వేల్పుల రాజు, హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడు గిన్నారపు మహేందర్ , అసెంబ్లీ కమిటీ ఉపాధ్యక్షులు కండె తిరుపతి , మాజీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డే సమ్మయ్య బోయిని బాబు మంద సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story