Sircilla: వెంగళ వెంకటేశం హత్యపై సిరిసిల్లలో బీఆర్ఎస్ నిరసన!
Sircilla: సిరిసిల్లలో వెంగళ వెంకటేశం హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్‌లో నిరసన నిర్వహించారు.
Sircilla: వెంగళ వెంకటేశం హత్యపై సిరిసిల్లలో బీఆర్ఎస్ నిరసన!
Sircilla: సిరిసిల్లలో వెంగళ వెంకటేశం హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. వెంగళ వెంకటేశం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీపై నెపం నెట్టే దురుద్దేశంతోనే వెంకటేశం హత్యకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, వ్యక్తిగత కక్షలు, రాజకీయ విభేదాలతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. వెంకటేశం హత్యలో ఎంతటి వారు ఉన్నా వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ, పద్మశాలీల పక్షాన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సిరిసిల్లలో బీఆర్ఎస్ నాయకులపై కక్షపూరిత రాజకీయాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.నిందితులపై చర్యలు తీసుకోని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.




