Yellareddypet: కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యంపై రోడ్డెక్కిన బీఆర్‌ఎస్ శ్రేణులు!
Yellareddypet: ఎల్లారెడ్డిపేటలో బీఆర్‌ఎస్ వినూత్న నిరసన కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాలకు నిరసనగా సీఎం రేవంత్‌రెడ్డికి పిండ ప్రదానం.
Yellareddypet: కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యంపై రోడ్డెక్కిన బీఆర్‌ఎస్ శ్రేణులు!
Yellareddypet: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఎల్లారెడ్డిపేటలో రెండో రోజూ కొనసాగాయి. ప్రభుత్వ హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు వినూత్నంగా ఆందోళన చేపట్టారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక పాత బస్టాండులో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వంటావార్పు నిర్వహించి, రోడ్డుపైనే భోజనం చేశారు.
అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పిండ ప్రదానం చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఇల్లందుల శ్రీనివాస్‌రెడ్డి, పందిర్ల పరుశరాం గౌడ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయినా హామీలు అమలు కాలేదని ఆరోపించారు.
వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ప్రభుత్వం చేసిన మేలు ఏమిటో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు.




