Kalwa Srirampur: కాళ్వ శ్రీరాంపూర్‌లో బిఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్ట్!

Kalwa Srirampur: పెద్దపల్లి కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న బిఆర్‌ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికే మచ్చ అని నేతల మండిపాటు.

KONDAL, SULTANABAD
Published on: 8 Sept 2026 12:53 PM IST
Kalwa Srirampur
X

Kalwa Srirampur: కాళ్వ శ్రీరాంపూర్‌లో బిఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్ట్!

Peddapalli: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద బిఆర్ఎస్ (టిఆర్ఎస్) సీనియర్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలతో పాటు మహిళా నాయకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికే మచ్చ అని స్థానిక బిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. పోలీసుల తీరును నిరసిస్తూ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చిన కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరుతున్న కాళ్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్‌లను పోలీసులు హౌస్ అరెస్టు చేసి, అనంతరం కాళ్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను ముందస్తు అరెస్టులు చేయడం దారుణమని, ఇది ప్రభుత్వ అణచివేత ధోరణికి ప్రతీక అని మండిపడ్డారు. శాంతియుత నిరసనలను కూడా సహించలేక ముందస్తు అరెస్టులకు పాల్పడటం విచారకరమన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా, హౌస్ అరెస్టులతో అడ్డుకోవాలని చూసినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం, పార్టీ నాయకులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.

​అరెస్ట్ అయిన వారిలో మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, మాజీ జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డిలతో పాటు నాయకులు నిదానపురం దేవయ్య, ఇబ్రహీం, కొల్లూరి రాజమల్లు, మాదాసి చందు తదితరులు ఉన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story