Karimnagar: కరీంనగర్ పాలిటిక్స్ మాజీ మేయర్ సునీల్ రావుపై బీఆర్ఎస్ ఫైర్

Karimnagar: కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావుపై బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 6 Jun 2026 4:29 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ పాలిటిక్స్ మాజీ మేయర్ సునీల్ రావుపై బీఆర్ఎస్ ఫైర్

కరీంనగర్: రాజకీయ స్వార్థం కోసం ఏ పార్టీ అధికారం లో ఉంటే ఆ పార్టీ లో చేరడం అలవాటు గా మార్చుకున్న నీచమైన వ్యక్తి మాజీ మేయర్ సునీల్ రావు అని నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరి శంకర్ అన్నారు. కరీంనగర్ నగరంలోని 47వ డివిజన్‌లో గల మీకోసం కార్యాలయంలో బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ పైన తీవ్ర విమర్శలు చేశారు.

కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కృషి ఫలితమేనని, గతంలో ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పి ఇప్పుడు భిన్నంగా మాట్లాడుతున్న సునీల్ రావు ది అది నోరా మోరా అని ఘాటుగా విమర్శించారు.కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తమ వైఖరిని ఎప్పటికప్పుడు మార్చుకుంటున్న ఊసరవెల్లి నాయకుడు అని అన్నారు.కేంద్ర మంత్రి సమక్షంలో కూడా స్మార్ట్ సిటీ విషయంలో వినోద్ కుమార్ పాత్రను ప్రస్తావించిన వీడియోలు ఉన్నాయని.

అవి ప్రజలందరికీ తెలుసన్నారు. వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం తన వైఖరిని మార్చుకుని ఇప్పుడు కేంద్ర మంత్రికి దగ్గర అవడం సిగ్గు చేటు అన్నారు. పార్లమెంట్‌లో కరీంనగర్ అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెబుతున్న నాయకులు ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.

అలాగే దేవాలయాలకు ప్రత్యేక నిధులు, నవోదయ విద్యాలయం, జాతీయ రహదారి పనులు, డంప్ యార్డ్ అభివృద్ధి వంటి అంశాలపై చేసిన హామీల అమలు గురించి ప్రశ్నించారు.

కరీంనగర్‌కే కాకుండా ఇతర నగరాలకు కూడా కేంద్ర పథకాల ద్వారా నిధులు వచ్చాయని, వాటిని వ్యక్తిగత ఘనతగా చెప్పుకోవడం సరికాదన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడం, గ్రామాల్లో తాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయన్నారు.

కరీంనగర్ అభివృద్ధికి కృషి చేసిన మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు.

తమ పార్టీపై ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా ప్రతిస్పందిస్తారని హెచ్చరించారు. గతంలో బండి సంజయ్‌పై చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు మరిచిపోయి భిన్నంగా వ్యవహరిస్తున్న నాయకుడు ఎవరైనా ఉంటే అతనే, అవినీతి అనకొండ లఫంగి సునీల్ రావు అని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు బారాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story