Peddapalli: కాల్వ శ్రీరాంపూర్‌లో ఘనంగా 'తల్లిపాల వారోత్సవాలు'

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు. చిన్నారులకు అన్నప్రాసన అక్షరాభ్యాసం చేసి తల్లిపాల ప్రాముఖ్యత తెలిపారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 3 Aug 2026 1:21 PM IST
Peddapalli
X

Peddapalli: కాల్వ శ్రీరాంపూర్‌లో ఘనంగా 'తల్లిపాల వారోత్సవాలు'

కాల్వ శ్రీరాంపూర్ 1వ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా 'తల్లిపాల వారోత్సవాలు'

​చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలు

​పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ గ్రామ పరిధిలోని 1వ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ హాజీర ఆధ్వర్యంలో 'తల్లిపాల వారోత్సవాలను' సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ బంగారి రమేష్ ఉపసర్పంచ్ గోలి సుధాకర్ హాజరై అన్నప్రసన అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గర్భిణులు, బాలింతలు మరియు తల్లులకు తల్లిపాల విశిష్టతపై ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

​ఈ సందర్భంగా సర్పంచ్ బంగారి రమేష్ మాట్లాడుతూ, బిడ్డ పుట్టిన వెంటనే ఇచ్చే ముర్రుపాలు (కొలొస్ట్రమ్) పసిపాపలకు మొదటి టీకా వంటిదని, ఇది పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే అందించాలని సూచించారు.అంగన్‌వాడీ సేవల ప్రాముఖ్యత:

​పౌష్టికాహారం & ఆరోగ్య లక్ష్మి: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు మరియు బాలింతలకు రోజువారీ పౌష్టికాహారంతో పాటు 'ఆరోగ్య లక్ష్మి' పథకం కింద సమతుల్య భోజనం, పాలు, గుడ్లు అందిస్తున్నట్లు తెలిపారు.

​చిన్నారుల ఎదుగుదల లెక్కింపు: 0 నుండి 6 ఏళ్ల లోపు పిల్లలకు పోషకాహార లోపం రాకుండా క్రమం తప్పకుండా బరువు, ఎత్తు కొలతలు తీస్తూ ఆరోగ్య నమోదు చేపడుతున్నారని వివరించారు.

​వ్యాధి నిరోధక టీకాలు: ఏఎన్‌ఎమ్‌లు, ఆశా కార్యకర్తల సహకారంతో పిల్లలకు కాలానికి అనుగుణంగా వేయాల్సిన టీకాలను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారానే వేయిస్తున్నట్లు గుర్తుచేశారు.

​పూర్వ ప్రాథమిక విద్య (ప్రీ-స్కూల్): చిన్నతనంలోనే పిల్లలకు ఆటపాటలతో కూడిన నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తూ, వారి మానసిక వికాసానికి అంగన్‌వాడీలు పునాది వేస్తున్నాయని చెప్పారు.

​గ్రామంలోని గర్భిణులు, తల్లులందరూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను, పౌష్టికాహారాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలని సర్పంచ్ బంగారి రమేష్ కోరారు.​ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సర్పంచ్ బంగారి రమేష్, ఉప సర్పంచ్ గోలి సుధాకర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి అశోక్, అంగన్వాడీ టీచర్ హాజీర, వార్డు సభ్యులు, ఆయా కేంద్రాల ఆయా, తల్లులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story