Sircilla: వైభవంగా ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు హాజరైన సిరిసిల్ల చైర్‌పర్సన్!

Sircilla: రాజన్న సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 7 Aug 2026 12:30 PM IST
Sircilla
X

Sircilla: వైభవంగా ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు హాజరైన సిరిసిల్ల చైర్‌పర్సన్!

Sircilla: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో మైసమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.

మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్, 17వ వార్డు కౌన్సిలర్ గుండ్లపల్లి నీరజ పూర్ణచందర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో బోనాల పండుగకు విశిష్ట స్థానం ఉందన్నారు. ప్రజలకు సేవలందించే మున్సిపల్ ఉద్యోగులు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు, పారిశుధ్య కార్మికులు సమాజ శ్రేయస్సు కోసం ఐక్యంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

మైసమ్మ తల్లి చల్లని దీవెనలతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలని, వ్యాపారాలు అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే మున్సిపల్ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులందరికీ అమ్మవారి ఆశీస్సులు లభించి వారి సేవలు నిరంతరం ప్రజలకు ఉపయోగపడాలని కోరుకున్నారు.

అనంతరం మున్సిపల్ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు డప్పు చప్పుళ్ల మధ్య మైసమ్మ తల్లి, పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సంప్రదాయ నృత్యాలు, భక్తి వాతావరణం మధ్య వేడుకలు కనులపండువగా సాగాయి.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story